హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పాస్పోర్ట్ రీజినల్ కార్యాలయం శనివారం నిర్వహించిన పాస్పోర్టు మేళాకు అనూ హ్య స్పందన లభించింది. ఐదు పాస్పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్టల్ పాస్పోర్టు సేవా కేంద్రాల ద్వారా 3,200 దరఖాస్తులను స్వీకరించినట్టు రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తెలిపారు. ఇందులో 98 శాతం సిటీ నుంచి స్లాట్ బుకింగ్ కాగా, 65 శాతం దరఖాస్తుల ప్రక్రియ ముగిసిందని పేర్కొన్నారు.