బ్లాక్ ఫంగస్‌కు యునానీ వైద్యం

- మూడురకాల మందులు తయారుచేసిన యునానీ దవాఖాన ఫ్రొఫెసర్ల బృందంగాంధీ, ఈఎన్టీలో వినియోగం
- వచ్చేవారం నుంచి అన్ని యునానీ దవాఖానల్లో: ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి వెల్లడి
చార్మినార్, మే 20: కొవిడ్‌నుంచి కోలుకున్నా బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రాణాంతకంగా మారుతున్న తరుణంలో దీని నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. గురువారం చార్మినార్ యునానీ దవాఖానలో వర్షిణి మాట్లాడు తూ రోజురోజుకు విస్తృతమవుతున్న బాక్ల్ ఫంగస్ నిరోధానికి ప్రత్యేక కమిటీలను నియమించి ఔషధాలపై పరిశోధన చేయాలని సీఎం సూచించారని చెప్పారు. యునా నీ దవాఖానలోని ప్రొఫెసర్లు డాక్టర్ షహజాదీ సుల్తానా, ఎంఏ ఫారుఖీ, సయ్యద్ సలావుద్దీన్, ఎస్‌జేబీ బుఖారీ, జైబున్నిసా బృందం యునానీ వైద్య విధానంలో బ్లాక్ ఫంగస్‌ను అడ్డుకొనే మందులను గుర్తించిందని వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి కూడా పొందిన ఆ మందును గాంధీ, ఈఎన్టీ దవాఖానల్లో రోగులకు అందించామని తెలిపారు. యునానీ దవాఖానలో ఈ మందు అందుబాటులో ఉన్నదని తెలిపారు. వచ్చేవారం నుంచి రాష్ట్రంలోని అన్ని యునానీ దవాఖానల ద్వారా ఈ మందు ను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. యునానీలో బ్లాక్ ఫంగస్‌ను అడ్డుకునే మూడు మందులను గుర్తించామని యునా నీ ప్రొఫెసర్ డాక్టర్ బుఖారీ తెలిపారు. అల్క్ అజీబ్, హబ్-ఏ ముస్సఫీ, ఖమిరా అబ్రేహం మందులతో బ్లాక్ ఫంగస్‌ను నివారించవచ్చని వివరించారు.
ఔషధాలను ఇలా వాడాలి
1.అల్క్ అజీబ్: ఈ మందును టీ, కాఫీ, డికాక్షన్, పాలతోపాటు గోరు వెచ్చని నీటిలో రెండు చుక్కలు కలుపుకొని తాగాలి. దీనివల్ల నాసికా రంధ్రాల్లో దాగి ఉన్న వైరస్ నశిస్తుంది.
- హబ్-ఏ-ముస్సఫీ: హబ్ (క్యాప్సుల్) ఉదయం, రాత్రి సమయంలో టిఫిన్, డిన్నర్ పూర్తయిన తర్వాత వేసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తంలోని వైరస్‌ను నిర్మూలిస్తుంది.
3, ఖమిరా అబ్రేహం: దీనిని రెండు రకాలుగా అందిస్తారు. మధుమేహ రోగులకు పౌడర్ రూపంలో, ఇతరులకు లేహ్యంగా అందిస్తారు. పౌడర్ రూపంలోని ఔషధాన్ని 500 మిల్లీగ్రాముల చొప్పున ఉదయం, రాత్రి సమయాల్లో తీసుకోవాలి. లేహ్యాన్ని స్వచ్ఛమైన తేనె కలిపి తయారుచేస్తారు. మధుమేహంలేనివారు రోజూ ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత 5 గ్రాముల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. వారం నుంచి పదిరోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఔషధాలను వాడాలని డాక్టర్ బుఖారీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

