Train collision | పెద్దపల్లి జిల్లాలో విషాదం.. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢీ కొని ఇద్దరి మృతి
Train collision | ఇన్నాళ్లు ఉపాధి కల్పించిన ఆ రైళ్లే వారి పాలిట మృత్యు పాశాలవుతాయనివారు ఊహించలేకపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ బక్క ప్రాణులు పొట్టకూటి కోసం రైళ్లలో వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ ఇద్దరి వ్యక్తులను విధి చిన్న చూపు చూసింది. రైలు(Train) రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇద్దరిని బలితీసుకుంది. ఇన్నాళ్లు ప్రయాణికులకు నీళ్లందించే ఆ కార్మికుల కుటుంబాలకు మాత్రం చివరికి కన్నీళ్లే మిగిలాయి.
పెద్దపల్లి : ఇన్నాళ్లు ఉపాధి కల్పించిన ఆ రైళ్లే వారి పాలిట మృత్యు పాశాలవుతాయనివారు ఊహించలేకపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ బక్క ప్రాణులు పొట్టకూటి కోసం రైళ్లలో వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ ఇద్దరి వ్యక్తులను విధి చిన్న చూపు చూసింది. రైల్వే స్టేషన్ క్యాంటీన్లో వాటర్ క్యాన్స్ వేసి టీ తాగేందుకు రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు(Train) రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇద్దరిని బలితీసుకుంది. ఇన్నాళ్లు ప్రయాణికులకు నీళ్లందించే ఆ కార్మికుల కుటుంబాలకు మాత్రం చివరికి కన్నీళ్లే మిగిలాయి.
ఈ హృదయవిదాకర సంఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్(Peddapally)లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రాజు(40) యాకూబ్ (45) అనే ఇద్దరు వ్యక్తులు రైళ్లలో, క్యాంటిన్లలో వాటర్ సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎప్పటిలాగే వాటర్ ప్యాకెట్ల్ సరఫరా చేస్తుండగా ప్రమాదవశాత్తు ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ప్రెస్(Telangana Express) ట్రెయిన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. రాజు, యాకుబ్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

