హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : నూతన వాహనాలకు ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ల తాతాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)ను రెండు నెలల వరకు పొడిగించినట్లు రవాణాశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నూతన వాహనాలకు జారీచేసే తాతాలిక రిజిస్ట్రేషన్ చెల్లుబాటు గడువు 30 రోజులు మాత్రమే ఉంటుంది.
అయితే, వాహన యజమానుల సౌకర్యార్థం ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లను రిజర్వ్ చేసుకునే గడువును తాతాలిక రిజిస్ట్రేషన్ జారీ చేసిన తేదీ నుంచి 2 నెలల వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.