Road accident | అన్న 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజినీర్.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి.. హన్మకొండలో దారుణం
Road accident | బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డ చెట్టంత కొడుకులను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు..! ఇక వాళ్లకు పెళ్లిళ్లు చేసి మనుమలు, మనుమరాండ్లతో కాలక్షేపం చేయవచ్చని ఆశపడ్డారు..! కానీ ఇంతలో విధికి కన్నుకుట్టింది..! రోడ్డు ప్రమాదం రూపంలో ఎదిగిన కొడుకులిద్దరినీ మృత్యువు కబలించింది..! ఆ తల్లిదండ్రుల ఆశలు ఆడియాశలయ్యాయి..! ఇళ్లు చిన్నబోయింది..! గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి..!
హసన్‌పర్తి: ఇద్దరూ ఒకే తల్లి బిడ్డలు..! కలిసి పెరిగారు, కలిసి బతికారు..! తల్లిదండ్రులు కష్టపడి చదివించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు..! వాళ్లూ కష్టపడి ఉన్నత చదువులు చదివారు..! అన్న ఒకదాని తర్వాత ఒకటి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు..! తమ్ముడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు..! బాగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డ చెట్టంత కొడుకులను చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు..! ఇక వాళ్లకు పెళ్లిళ్లు చేసి మనుమలు, మనుమరాండ్లతో కాలక్షేపం చేయవచ్చని ఆశపడ్డారు..! కానీ ఇంతలో విధికి కన్నుకుట్టింది..! రోడ్డు ప్రమాదం రూపంలో ఎదిగిన కొడుకులిద్దరినీ మృత్యువు కబలించింది..! ఆ తల్లిదండ్రుల ఆశలు ఆడియాశలయ్యాయి..! ఇళ్లు చిన్నబోయింది..! గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి..!
ఘటనకు సంబంధించి హసన్‌పర్తి ఎస్ఐ విజయ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ (25), చిన్న కుమారుడు హరికృష్ణ (23). బట్టల వ్యాపారం చేస్తూ ఇద్దరినీ మంచి చదువులు చదివించి ప్రయోజకులను చేశాడు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ రైల్వే శాఖలో ఉద్యోగానికి ఎంపికై మౌలాలీ (సికింద్రాబాద్)లో శిక్షణ పొందుతున్నాడు. చిన్న కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో పెద్దకుమారుడు శివరామకృష్ణకు పోస్టల్ శాఖలో మరో ఉద్యోగం వచ్చిందని చెప్పడం కోసం ఆదివారం స్వగ్రామం కందుగులకు వచ్చాడు. సోమవారం డ్యూటీకి వెళ్లాలని ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి తమ్ముడితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద 5.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ, హరికృష్ణ తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హసన్‌పర్తి ఎస్సై విజయ్‌కుమార్, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్‌కుమార్, ఇతర పొలీస్ సిబ్బంది వచ్చి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఢీకొట్టి తప్పించుకున్న వాహనాన్ని గుర్తించడం కోసం స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను సేకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

