అక్రమంగా ఫీజులు వసూలుచేస్తే..ట్యూషన్ ఫీజు కట్!
బీటెక్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల నుంచి ప్రైవేట్ కాలేజీలు వేలకు వేలు అక్రమంగా వసూలు చేయడాన్ని విద్యాశాఖ సీరియస్‌గా తీసుకున్నది.
- నమస్తే కథనానికి స్పందన
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీటెక్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల నుంచి ప్రైవేట్ కాలేజీలు వేలకు వేలు అక్రమంగా వసూలు చేయడాన్ని విద్యాశాఖ సీరియస్‌గా తీసుకున్నది. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారి నుంచి కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి కాలేజీలు వేలకు వేలు వసూలు చేస్తున్నా యి. ఇదే విషయంపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ఇంజినీరింగ్ కా లేజీ ఫీజుల దందా’ శీర్షిక పేరిట కథనం ప్రచురితమయ్యింది. ఈ కథనంపై ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ అధికారులు స్పందించారు. ఉన్నత విద్యామండలి అధికారులు ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్‌తో చర్చించారు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే కట్టిన ఫీజులను ట్యూషన్ ఫీజు నుంచి మినహాయించి చెల్లిస్తామని పేర్కొన్నారు. రుజువులు, ఆధారాలతో మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో తమకు ఫిర్యాదుచేయాలని సూచించారు.
ఇంకా చదవల్సిన వార్తలు
‘నవోదయం’ లేనట్టే! ; రాష్ర్టానికి ఏడు జేఎన్వీలు మంజూరు
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మంజూరైన కొత్త జవహర్ నవోదయ విద్యాయాల (జేఎన్వీ) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నవోదయకు కావాల్సిన స్థలాల కేటాయింపు పూర్తిచేయడం లేదు. ఫలితంగా మూడు జేఎన్వీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంగారెడ్డి, మే డ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాలు స్థల సేకరణ పూర్తికాని వాటిలో ఉన్నాయి. దీంట్లో సీఎం సొంత జిల్లా పాలమూరు ఉండటం గమనార్హం. ఈ మూడు పాఠశాలలకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేయలేదు. రాష్ర్టానికి ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరైన విషయం తెలిసిందే. అయితే వీటి ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగింది. దీనిపై జూన్ 2న ‘నమస్తే తెలంగాణ’లో ‘నవోదయ.. ఈసారి అడ్మిషన్ లేదయా’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా రాష్ట్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలైలోపు ఈ ఏడు నవోదయ పాఠశాలలను అందుబాటులోకి తీసుకొచ్చి, అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించారు. తాత్కాలిక క్యాంపస్‌లో వీటి ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. నవోదయ విద్యాలయాల కోసం తొలుత స్థల కేటాయింపును పూర్తిచేసి, ఆ తర్వాత తాత్కాలిక క్యాంపస్‌లో కొత్త జేఎన్వీలను ప్రారంభించాలని కేంద్రం షరతు విధించింది. ఏడు నవోదయ విద్యాలయాల్లో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలలో మాత్రమే స్థల సేకరణ పూర్తయింది. సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్‌లలో స్థల కేటాయింపు పూర్తికాలేదు. దీంతో వాటికి కేంద్రం తుది అనుమతులివ్వలేదు. దీంతో అడ్మిషన్లకు బ్రేక్‌పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

