సంక్షేమ హాస్టళ్లలో 581 పోస్టులు
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు కొనసాగుతున్నా యి. డిసెంబర్లో టీఎస్పీఎస్సీ ఉద్యోగ భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
- అత్యధికంగా 549 హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు
- జనవరి 6 నుంచి 27 వరకు దరఖాస్తులు
- నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు కొనసాగుతున్నా యి. డిసెంబర్లో టీఎస్పీఎస్సీ ఉద్యోగ భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. గురువారమే 185 వెటర్నరీ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ.. శుక్రవారం సంక్షేమ హాస్టళ్లలో 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. అందులో అత్యధికంగా 549 హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు ఉన్నాయి. వార్డెన్ 8, మ్యాట్రన్ 5, లేడీ సూపరింటెండెంట్ పోస్టులు 19 ఉన్నాయి. దీనితోపాటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2లో మొత్తం 140 ఉద్యోగాలు ఉన్నాయి.
అందులో ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో 87, పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో 14, ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్లో 26, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్లో 13 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
ఏ క్యాటగిరీలో ఎన్ని ఉద్యోగాలు
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 (ట్రైబల్ వెల్ఫేర్) 05
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (ట్రైబల్ వెల్ఫేర్) 106
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 ఫీమేల్ (ఎస్సీ డెవలప్మెంట్) 70
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 మేల్ (ఎస్సీ డెవలప్మెంట్) 228
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (బీసీ వెల్ఫేర్) 140
వార్డెన్ గ్రేడ్-1 (డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్) 05
మ్యాట్రన్ గ్రేడ్-1 (డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్) 03
వార్డెన్ గ్రేడ్-2 (డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్) 03
మ్యాట్రన్ గ్రేడ్-2 (డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్) 02
లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ (ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్) 19
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

