హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ రిలీజ్ చేశారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలుంటాయి. ఈ నెల 30 నుంచి జూలై 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ జూలై 22న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూలై 23న ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది.