Wine prices | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది. ఫుల్బాటిల్పై రూ.40 తగ్గించింది. అన్ని రకాల మద్యం ధరలను తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నది. బీర్లు, రెడీ టు డ్రింక్స్ ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. తగ్గించిన మద్యం ధరల వివరాలను తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గజ్జెల నగేశ్ వెల్లడించారు.
మద్యం క్వాటర్ (180 ఎంఎల్) బాటిల్ ధరలో రూ.10, ఆఫ్ బాటిల్ (375 ఎంఎల్) ధరలో రూ.20, ఫుల్ బాటిల్ (750 ఎంఎల్) ధరలో రూ.40 తగ్గించారు. ఈ ధరలు సోమవారం నుంచి కొత్తగా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లపై వర్తిస్తాయని తెలిపారు.