TS Weather | లోక్‌సభ ఎన్నికల వేళ.. వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్..!
TS Weather | పార్లమెంట్ నాలుగో విడుత ఎన్నికలు తెలంగాణవ్యాప్తంగా జరుగనున్నాయి. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
TS Weather | పార్లమెంట్ నాలుగో విడుత ఎన్నికలు తెలంగాణవ్యాప్తంగా జరుగనున్నాయి. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వానలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
మంగళవారం ఉమ్మది ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపే, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. బుధ, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

