TS Police Events | రేపట్నుంచే పోలీసు ఈవెంట్స్.. ఇవి మిస్ కాకండి..
TS Police Events | రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వరకు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
TS Police Events | రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులకు డిసెంబర్ 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వరకు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
ఈవెంట్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు తమకు నిర్దేశించిన కేంద్రానికి వెళ్లి ఉదయం 6 గంటల లోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం(క్యాస్ట్ సర్టిఫికెట్), అడ్మిట్ కార్డు, పార్ట్-2 అప్లికేషన్ ఫారమ్‌తో పాటు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాలి. ఈ పత్రాలపై తప్పనిసరిగా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తప్పనిసరి.
-పురుష అభ్యర్థులు 7 నిమిషాల 15 సెకన్లలో 1600 మీటర్ల పరుగు పూర్తి చేయాలి. అనంతరం ఎత్తును కొలుస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే 9 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
-మహిళా అభ్యర్థులు 5 నిమిషాల 20 సెకన్లలో 800 మీటర్ల పరుగును పూర్తి చేయాలి.
-పురుషులు లాంగ్ జంప్ 4 మీటర్లు ఆపైన చేయాలి. మహిళలు 2.50 మీటర్లు, ఆపై చేయాల్సి ఉంటుంది.
-పురుషులు షార్ట్ పుట్(7.26 కేజీలు) 6 మీటర్లు, ఆపైన విసరాలి. మహిళలు షాట్ పుట్(4 కేజీలు) 4 మీటర్లు, ఆపైన విసరాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

