TS PECET 2023 | టీఎస్ పీఈసెట్ -2023 షెడ్యూల్ విడుదల
TS PECET 2023 | హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్ - 2023 షెడ్యూల్ విడుదలైంది. బీపీఎడ్( B.PEd ), డీపీఎడ్( D.PEd ) కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్( TS PECET ) నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల కానుంది.
TS PECET 2023 | హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్ – 2023 షెడ్యూల్ విడుదలైంది. బీపీఎడ్( B.PEd ), డీపీఎడ్( D.PEd ) కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్( TS PECET ) నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి( TSCHE ) చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ వీసీ, టీఎస్ పీఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల వీసీలు గోపాల్ రెడ్డి, లక్ష్మీకాంత్ రాథోడ్ కలిసి విడుదల చేశారు.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి మే 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 500, మిగతా కేటగిరిల వారికి రూ. 900గా ఫీజు నిర్ణయించారు. ఆలస్యం రుసుం రూ. 500తో మే 15 వరకు, రూ. 2000తో మే 20 వరకు, ఆలస్య రుసుం రూ. 5 వేలతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. జూన్ మూడో వారంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. తదితర వివరాల కోసం www.pecet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- B.PEd
- D.PEd
- TS PECET 2023
- TSCHE
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

