TS LAWCET | టీఎస్ లాసెట్ – 2023 షెడ్యూల్ విడుదల
TS LAWCET | టీఎస్ లాసెట్ -2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్ : టీఎస్ లాసెట్ -2023 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. లాసెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి రవీందర్, లాసెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మి కలిసి విడుదల చేశారు.
మార్చి 2 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600గా దరఖాస్తు ఫీజు నిర్ధారించారు. రూ. 500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 12 వరకు, రూ. 1000తో ఏప్రిల్ 19 వరకు, రూ. 2 వేలతో ఏప్రిల్ 26 వరకు, రూ. 4 వేలతో మే 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ ఎల్సెట్ ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం https://lawcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

