రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్
రాయలసీమ ఎత్తిపోతల | ఏపీ జలదోపిడీపై తెలంగాణ ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తొలిసారిగా జాతీయ హరిత ట్రిబ్యునల్

హైదరాబాద్ : ఏపీ జలదోపిడీపై తెలంగాణ ప్రభుత్వం పోరాటాన్ని ఉధృతం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తొలిసారిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ( NGT ) చెన్నై ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. గతంలో జారీ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని ధిక్కరణ పిటిషన్‌ను తెలంగాణ సర్కార్ దాఖలు చేసింది. పర్యావరణ శాఖ, జలశక్తి శాఖ, కృష్ణా నది యాజమాన్య బోర్డు నుంచి సరైన అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని పిటిషన్లో పేర్కొంది. ఈ ఎత్తిపోతల పనులను ఎన్జీటీ బృందం సందర్శించాలని కోరింది. ఎన్జీటీ బృందానికి హెలికాప్టర్, వాహనాలు కూడా సమకూరుస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఏపీ సర్కార్‌పై చర్య తీసుకోకుండా త్రిసభ్య కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. ఏపీ ఫిర్యాదులను మాత్రమే చర్చిస్తామనడం సరికాదని తెలంగాణ పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

