TSGENCO | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 31న నిర్వహించాల్సిన రాత పరీక్ష వాయిదా వేసినట్టు ఆ సంస్థ సీఎండీ గురువారం తెలిపారు. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా పరీక్షలకు వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని జేఎన్కో అధికారులు తెలిపారు.