TS ECET | టీఎస్ ఈసెట్ తుది విడుతలో 88.53 శాతం సీట్లు భర్తీ
TS ECET | టీఎస్ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌లో 88.53 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్‌లో ల్యాట్రల్ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌లో శుక్రవారం తుది విడుత సీట్లు కేటాయించారు.
TS ECET | టీఎస్ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌లో 88.53 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్‌లో ల్యాట్రల్ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌లో శుక్రవారం తుది విడుత సీట్లు కేటాయించారు.
ఈ ఏడాది ఈసెట్‌లో 20,895 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో 13,188 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, తుది కౌన్సెలింగ్‌లో 8,150 మంది వెబ్ఆప్షన్లు ఎంచుకొన్నారు. ఇంజినీరింగ్‌లో 11,855, ఫార్మసీలో 1228 సీట్ల చొప్పున మొత్తం 13,083 సీట్లున్నాయి. ఇంజినీరింగ్‌లో 10,496 సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీలో 77 సీట్లు నిండాయి. మరో 2,510 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. లేని యెడల సీటు క్యాన్షిల్ కానుంది.
సెల్ఫ్ రిపోర్టింగ్ ఇలా..
ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నెల 29వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లేని పక్షంలో సీటు ఆటోమేటిక్‌గా క్యాన్షిల్ అవుతుంది. అలాట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే.. రీఫండ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

