TS EAMCET | హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వరకు కొనసాగనుంది.