Engineering Courses | టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 26 నుంచి ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ కాలేజీ అయితే బాగుంటుంది. ఏ కోర్సులో చేరితే లైఫ్ ఉంటుంది. అసలు మన ర్యాంక్‌కు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వస్తుందనే అంశంపై ఇంజినీరింగ్ విద్యార్థులు శోధిస్తుంటారు. వారి తల్లిదండ్రులు కూడా ఇదే అంశంపై పలువురిని సంప్రదిస్తుంటారు. మరి ఏ కాలేజీలో, ఏ కోర్సులో ఏ ర్యాంకు వరకు సీట్లు వచ్చాయో తెలుసుకుందాం. 2022-23 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో కటాఫ్ ర్యాంకుల వివరాలు..