Khammam | ఖమ్మం జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
ఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్లలో (Konijerla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది.
ఖమ్మం: ఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్లలో (Konijerla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖమ్మం దవాఖానకు తరలించారు. ఎదురుగా వెళ్తున్న లారీ బ్రేకు వేయడంతో కారు ఢీకొన్నదని, దీంతో కారు వెనక వస్తున్న మరో లారీ దానిని గుద్దిందని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతులను వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్ (13)గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

