కొమ్మ నరికితే కాత ఆపుతానా అన్నట్టు ఈ మామిడి చెట్టు కొమ్మ నరికిన చోటే కాయలు కాసి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జనగామ జిల్లా దేవరుప్పులలో నీరటి సోమయ్య అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని మామిడితోటలో ఓ చెట్టు కొమ్మ కిందికి ఉండటంతో ట్రాక్టర్, అరక నాగలితో దున్నడానికి అడ్డు వస్తున్నదని నరికేశాడు. నరికిన కొమ్మ వద్దే చిన్నచిన్న కొమ్మల రూపంలో వచ్చి వాటికి కాయలు కాయడం విశేషం.
దేవరుప్పుల