Traffic Alert | హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో ఉదయం 8 నుంచి 11.30 వరకు వాహనాల రాకపోకలు బంద్
బక్రీద్ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
హైదరాబాద్: బక్రీద్ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. మీరాలం ట్యాంక్ ఈద్గా (Meer Alam tank eidgah) ప్రాంతంలో ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు ఉంటాయని తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారు బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల మధ్య ఈ రూట్లలో అనుమతిస్తారు.
- ఈ వాహనాలను జూ పార్కు, మసీద్ అల్హా హో అక్బర్ ఎదురుగా పార్కు చేయాలి.
- సాధారణ ట్రాఫిక్‌కు ఈద్గా రోడ్డు వైపు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్ బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు వద్ద కిషన్‌బాగ్, కామాటిపూరా, పురానాపూల్ వైపు మళ్లిస్తారు.
- శివరాంపల్లి, ధనమ్మ హట్స్ వైపు నుంచి ప్రార్థనల కోసం వచ్చే అన్ని వాహనాలను ధనమ్మ హట్స్ రోడ్డు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఈద్గా వైపు అనుమతించరు. ఈ వాహనాలు ధనమ్మ హట్స్ క్రాస్‌రోడ్స్ నుంచి శాస్త్రిపురం, ఎన్ఎస్కుంట రూట్లలో వెళ్లాలి.
- ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే వాటిని పురానాపూల్ దర్వాజ వద్ద జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
- ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను అరాంఘర్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు.
- కాలాపత్తర్ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలను కాలాపత్తర్ ఠాణా వైపు నుంచి ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతిస్తారు, సాధారణ వాహనాలను మోచీ కాలనీ, బహదూర్‌పురా వైపు మళ్లిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

