హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) అమలులో ఉండనున్నాయి. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్‌ట్యాంక్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
వాహనదారులు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ఏదైనా అత్యవసరమైతే 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని సూచించారు.