Traffic police | వాహనదారులపై దాడి చేసి.. కాలితో తన్నిన ట్రాఫిక్ సీఐ : వీడియో
Traffic police | వికారాబాద్ జిల్లా శంకర్ పల్లి(Shankarpalli) రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సీఐ(Traffic CI) వెంకటేశం వాహనదారుల పట్ల దురుసుగా(Attacked motorists) ప్రవర్తించాడు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయి. హత్యలు, దోపిడీ దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పలుచోట్ల పట్టపగలే నరికి చంపుకుంటున్నారు. మద్యం మత్తులో యువత పెడదారి పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆటకెక్కింది. పొలీసులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న మేడ్చల్‌లో లారీ డ్రైవర్‌పై ట్రాఫిక్ పోలీసుల దాడి సంఘటన మరువక ముందే తాజాగా వికారాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులపై భౌతిక దాడులకు పాల్పడటం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల వికారాబాద్ జిల్లా శంకర్ పల్లి(Shankarpalli) రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సీఐ(Traffic CI) వెంకటేశం వాహనదారుల పట్ల దురుసుగా(Attacked motorists) ప్రవర్తించాడు. కానిస్టేబుల్ జందార్ శ్రీను, హోంగార్డ్ కేశవ్‌తో కలిసి వాహనదారులపై చేయి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా బూటు కాలితో తన్నుతూ చితకబాదారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
సోమవారం నాడు శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా కొందరు యువకులను చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం కానిస్టేబుల్ జందార్ శీను హోంగార్డ్ కేశవ్ ఈ ముగ్గురు కలిసి కొడుతూ, తన్నుతూ ఉండగా వీడియో తీసిన వారి ఫోన్లు గుంజుకున్నారు. pic.twitter.com/vptB1k3w4h
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

