ఇంటివద్దకే టూరిజం బస్సు

- పది మంది ఉన్నా వాహనం ఏర్పాటు
- 28 ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో ముందుకు సాగుతున్నది. హైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలతో పర్యాటకులను ఆకర్షించేందుకు వారి కాలనీలు, అపార్ట్మెం ట్ల వద్దకే టూరిజం బస్సులను పంపేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) ఆధ్వర్యం లో చర్యలు చేపడుతున్నది. పదిమంది కలిసి టూర్‌కు వెళ్లాలన్నా మి నీ వాహనాన్ని పంపిస్తున్నది. దూరాన్ని బట్టి ఈ ప్యాకేజీలు ఒక్కో వ్యక్తికి రూ.450 నుంచి రూ.9,900 వరకు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, రామోజీ ఫిల్మ్‌సిటీ టూర్ ప్యాకేజీ ధరను రూ.1,850 గా నిర్ణయించింది. శ్రీశైలం (రూ.2,250), నాగార్జునసాగర్ (రూ.750), భద్రాచలం, పాపికొండలు (రూ.4,599), కాళేశ్వరం, వేములవాడ (రూ.3,999), యాదగిరిగుట్ట, కొలనుపాక, కొమురవెల్లి (రూ.1,499), రామప్ప, ఖిలావరంగల్ (రూ.3,649), శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో సోమశిల, నాగార్జునసాగర్ బోటింగ్ (రూ.3,999)తోపాటు ఇతర రాష్ర్టాల్లోని షిరిడీ, గోవా, మైసూర్, తిరుపతి, కాణిపాకం ప్రాంతాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలతో టూర్లను ఆఫర్ చేస్తున్నది. ఆన్‌రోడ్‌లో షిరిడీ టూర్‌కు రూ.9,900తో ప్యాకేజీని తీసుకొచ్చిన టీఎస్‌టీడీసీ.. రూ.14,999తో తిరుపతికి ఫ్లైట్ టూర్‌ను కూడా ఆఫర్ చేస్తున్నది.
పర్యాటకానికి కొత్త ఉత్సాహం
తెలంగాణలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తున్నాం. ఇప్పటివరకు హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువులకు మాత్రమే పరిమితమైన క్రూజ్బోట్లను శ్రీశైలం బ్యాక్వాటర్లోనూ ప్రవేశపెడుతున్నాం. ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్యాకేజీ. అంతేకాకుండా పర్యాటకులకు అనువుగా ఉండేలా ‘ఇంటి వద్దకే టూరిజం బస్సు’ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం.
- ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, టీఎస్‌టీడీసీ చైర్మన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- KTR
- Tourism bus
- tstdc
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

