కరెంటు షాక్‌తో టిప్పర్ డ్రైవర్ మృతి
టిప్పర్ కు కరెంటు తీగలు తగలడంతో షాక్‌కు గురై డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీ స్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
పెద్దఅంబర్‌పేట, జూన్ 21: టిప్పర్ కు కరెంటు తీగలు తగలడంతో షాక్‌కు గురై డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీ స్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. బీహార్‌కు చెందిన ధీరజ్‌కుమార్ (19) పెద్దఅంబర్‌పేటలో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భారీ రాళ్ల లోడ్‌తో ఉన్న టిప్పర్‌ను ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు లో కొహెడ పరిధిలోని మైత్రి విల్లాస్ వెం చర్కు తీసుకెళ్లాడు. అక్కడ రాళ్లను దింపే క్రమంలో టిప్పర్ వెనుక భాగం పైకి లేవగానే కరెంటు తీగలు తగిలాయి. లారీకి విద్యుత్తు సరఫరా కావడంతో ధీరజ్‌కుమార్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’
IAS Transfers | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ.. ప్రత్యేక అధికారిగా సర్పరాజ్ నియామకం
Railway Jobs | రైల్వేలో 191 ఐసోలేటెడ్ పోస్టులు.. డిసెంబర్ 4తో ముగియనున్న గడువు
విశాఖలో విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం.. కైలాసగిరి లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

