Tiger | పెద్దపులి రీ ఎంట్రీ.. కాసిపేట అడువుల్లో మళ్లీ గాండ్రింపులు..
Tiger | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మళ్లీ పెద్ద పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో 20 రోజుల పాటు పెద్దపులి కాసిపేట మండలంలో మకాం వేసి హల్చల్ చేసి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది. కాసిపేట మండలంలో పులి గాండ్రింపులతో అలజడి మొదలైంది.
Tiger | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మళ్లీ పెద్ద పులి రీ ఎంట్రీ ఇచ్చింది. గత ఫిబ్రవరిలో 20 రోజుల పాటు పెద్దపులి కాసిపేట మండలంలో మకాం వేసి హల్చల్ చేసి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది. కాసిపేట మండలంలో పులి గాండ్రింపులతో అలజడి మొదలైంది. కాసిపేట మండలంలోని వెంకటాపూర్, మల్కెపల్లి బీట్ పరిధిలో వెంకటపూర్ గ్రామానికి చెందిన రైతు బుద్దె రాజలింగుకు చెందిన లేగ దూడను పెద్దపులి దాడి చేసి హతమార్చినట్లు బెల్లంపల్లి రేంజర్ సీహెచ్ పూర్ణ చందర్ తెలిపారు. తన లేగ దూడ పులి దాడిలో చనిపోయిందని రైతు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగిందని, ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని మల్కెపల్లి, వెంకటాపూర్ బిట్ల సరిహద్దుల్లో ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందన్నారు.
పెద్దపులి అడుగులు కుంట వద్ద వరకు గుర్తించామన్నారు. తిర్యాణి, కాసిపేట మండలాల శివారులో పెద్దపులి సంచరిస్తుంది. వెంకటాపూర్, లక్ష్మీపూర్, ఎగ్గండి, పెద్దగూడ, సోనాపూర్ అటవీ శివారు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు. శివారు గ్రామాల రైతులు పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లకుండా, బయట మేపుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఎవరికైనను పెద్దపులి సమాచారం తెలిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, బాధిత రైతుకు నష్టపరిహారం కోసం పై అధికారులకు వివరాలు పంపించినట్లు తెలిపారు.
పెద్దపులి, చిరుత పులుల హల్చల్…
కాసిపేట మండలంలో అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత పులలు హల్చల్ చేస్తున్నాయి. గతంలో పెద్దపులి ఏకంగా 20 రోజుల పాటు కాసిపేట మండలంలోనే గ్రామాల సమీపంలోనే తిరుగుతూ హంగామా చేసింది. కంటి మీద కనుకు లేకుండా చేసింది. అడవి పందులపై దాడులు చేసింది. ఎవరికీ ఎటువంటి హానీ చేయకుండా వెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ పెద్ద పులి తిర్యాణి, కాసిపేట మధ్య అటవీ ప్రాంతాల్లో గ్రామాల శివారు ప్రాంతాల్లో తిరుగుతుండడం, లేగ దూడపై దాడి చేసి చంపడంతో మళ్లీ ఆందోళన పరిస్థితులు మళ్లీ నెలకొన్నాయి. దీంతో పాటు ఇటీవల దేవాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుత పులుల సంచారం విపరీతంగా పెరిగాయి. మద్దిమాడ,గట్రామ్పల్లి గ్రామాల్లో ఆవుల మందపై దాడులు చేశాయి. నిత్యం చిరుత పులుల సంచారం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెద్దపులి రావడం లేగ దూడ ను చంపడంతో కాసిపేట మండలంలో ప్రజలు భయందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

