హైదరాబాద్: సినీనటి షాలూ చౌరాసియాపై (Actor Chaurasia) దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిని పరిశ్రమలో లైట్‌బాయ్‌గా పనిచేస్తున్న బాబును అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. నిందితుడు బాబును మీడియా ముందు హాజరుపరిచారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు.
నిందితుడిది మహబూబ్‌నగర్ జిల్లా కుల్కచర్ల అని, ప్రస్తుతం అతడు యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. బాబు గదిలో బౌరాసియా ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతనిపై గతంలో విజయవాడ, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. గోల్కొండ పీస్‌లో నమోదైన కేసులో చంచల్‌గూడ జైలుకు వెళ్లొచ్చాడని తెలిపారు.