తెలంగాణ యూనివర్సిటీలో దౌర్జన్యం.. దీక్షాదివస్ టెంట్ కూల్చి, ఫ్లెక్సీల చించివేత
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీలో శనివారం తీవ్ర గందరగోళం నెలకొన్నది. దీక్షాదివస్‌లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారాంయాదవ్ తలపెట్టిన దీక్షా కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన వర్సిటీ యాజమాన్యం.. ఆ తర్వాత పోలీసులతో కలిసి దౌర్జన్యంగా వ్యవహరించింది.
కంఠేశ్వర్, నవంబర్ 29 : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీలో శనివారం తీవ్ర గందరగోళం నెలకొన్నది. దీక్షాదివస్‌లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారాంయాదవ్ తలపెట్టిన దీక్షా కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన వర్సిటీ యాజమాన్యం.. ఆ తర్వాత పోలీసులతో కలిసి దౌర్జన్యంగా వ్యవహరించింది. యూనివర్సిటీ గేటు ఎదుట దీక్షాశిబిరం కోసం ఏర్పాటు చేసిన టెంట్ కూల్చివేసి, మైక్ తొలగించడమే కాకుండా ఫ్లెక్సీలు సైతం చించేశారు. దీంతో రాజారాం యాదవ్, విద్యార్థులు వర్సిటీ పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. దీక్షాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం మొదట అనుమతినిచ్చి, తర్వాత నిరాకరించడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని మండిపడ్డారు.
కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే, ఆనాటి ప్రభుత్వం ఖమ్మం జైలులో నిర్బంధించిందని, అయినప్పటికీ ఆయన ప్రాణాలకు తెగించి దీక్ష కొనసాగించడంతో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ఆనాటి ఉద్యమ చరిత్రను భవిష్యత్తు తరాలకు చెప్పడం కోసం ఏర్పాటు చేసుకున్న దీక్షాదివస్‌కు అనుమతినివ్వకపోవడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఒత్తిడితో ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని రాజారాంయాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం ఎంతటి నిర్బంధాలు విధించినా విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయంలో బైఠాయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

