పోలీసు అభ్యర్థులకు శుభవార్త
ఫిజికల్ ఈవెంట్స్‌లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైన పోలీసు అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైకోర్టు సూచనల మేరకు మరోసారి ఆయా అభ్యర్థుల ఎత్తును కొలుస్తామని వెల్లడించింది.
- ఒక సెం.మీ లోపు ఎత్తు తక్కువున్న అభ్యర్థులకు చాన్స్
- 10 నుంచి 12 వరకు దరఖాస్తుల స్వీకరణ
- హైకోర్టు సూచనలతో టీఎస్ఎల్పీఆర్బీ నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ఫిజికల్ ఈవెంట్స్‌లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైన పోలీసు అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైకోర్టు సూచనల మేరకు మరోసారి ఆయా అభ్యర్థుల ఎత్తును కొలుస్తామని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్టు (టీఎస్ఎల్పీఆర్బీ) ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్‌లో ఎత్తు కొలతల నిర్వహణకు టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు www.tslprb.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
దరఖాస్తుతో పాటు అడ్మిట్ కార్డు చూపించి, దేహదారుఢ్య పరీక్షకు హాజరుకావాలని సూచించారు. రాష్ట్రంలో 17,516 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నియామకాల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ ముగిశాయి. మెయిన్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉన్నది. అయితే, ఫిజికల్ ఈవెంట్స్‌లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ ఎత్తుతో అర్హత సాధించలేకపోయిన చాలామంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పించాలని హైకోర్టు సూచించింది. దీంతో టీఎస్ఎల్పీఆర్బీ మరోసారి అభ్యర్థుల ఎత్తు కొలవాలని కీలక నిర్ణయం తీసుకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

