హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1 ఫలితాలు విడుదల చేశారు. సొసైటీ కార్యదర్శి సైదులు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. మెరిట్ జాబితా https:// mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions. org/ MJP-Degree వెబ్సైట్లలో అందుబాటులో ఉందని వివరించారు.
ఎంపికైన విద్యార్థులు 30వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తి చేసుకోవాలని వెల్లడించారు. వివరాలకు 040-23328266లో సంప్రదించాలని సూచించారు.