కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీపై నిర్లక్ష్యం తగదు
- భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌ను విస్తరించాలి
- ఎస్సీఆర్ జీఎంకు ఎంపీ నామా విజ్ఞప్తి
- కాజీపేట-బల్లార్షా మూడోలైన్ పనులు ప్రారంభం
- పూర్తిగా రైల్వే నిధులతో నిర్మాణం: జీఎం గజానన్
- రైల్ నిలయంలో పార్లమెంట్ సభ్యులతో సమావేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): విభజన చట్టంలోని కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిర్లక్ష్యం తగదని టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. కోచ్ ఫ్యాక్టరీపై ఏడేండ్లుగా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో పార్లమెంట్ సభ్యులతో దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సమావేశం నిర్వహించారు. తెలంగాణకు చెందిన 16 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులతోపాటు కర్ణాటక నుంచి ఇద్దరు ఎంపీలు హాజరయ్యా రు.
ఆయా నియోజకవర్గాలవారీగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టు పనులు, వాటి పురోగతి, నిధుల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎంపీ నామా కోరారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే పనులను విస్తరించాలని సూచించారు. పాండురంగాపురం- సారపాక రైల్వేలైనును నిర్మించాలని, దీనికి 2011 రైల్వే బడ్జెట్లో రూ.79.82 కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ.. కాజీపేట-బల్లర్షా, కాజీపేట-కొండపల్లి మార్గంలో మూడో రైల్వేలైను పనులను చేపట్టినట్టు తెలిపారు.
ఈ ప్రాజెక్టును పూర్తిగా రైల్వే నిధులతోనే చేపట్టినట్టు స్పష్టంచేశారు. ఎంపీలకు చెందిన నియోజకవర్గాలవారీగా పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల గురించి తెలియచేశారు. కాజీపేట-విజయవాడ రైల్వేలైను, మనోహరాబాద్-గజ్వేల్-కొత్తపల్లి నూతన రైల్వేలైను, అక్కన్నపేట-మెదక్ రైల్వేలైను, ఫలక్‌నుమా-డోన్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. కొవిడ్ తర్వాత 85 శాతం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 85 ప్యాసింజర్ రైళ్లు, 55 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఎంపీలు మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పీ రాములు, బీ వెంకటేశ్, బీబీ పాటిల్, కేఆర్ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, అసదుద్దీన్ ఒవైసీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అరవింద్, కర్ణాటక ఎంపీలు రాజా అమ్రేశ్వర్నాయక్, డాక్టర్ ఉమేశ్‌జాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

