Home
Telangana
The India Meteorological Department Has Says That The Southwest Monsoon Will Enter The Country Early This Year
Monsoon | ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు.. వెల్లడించిన ఐఎండీ
ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13న రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని ప్రకటించింది.
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13న రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని ప్రకటించింది.
సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ మీదుగా ఉత్తరం వైపునకు వెళ్లి, జూలై 15 నాటికి దేశమంతా విస్తరిస్తాయని, అయితే, ఈ ఏడాది ఊహించిన దానికంటే ముందుగానే జూన్ 1 నాటికి కేరళ తీరానికి, జూలై 11నాటికి దేశమంతా విస్తరించే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఐఎండీ అంచనా మేరకు మే 25 నాటికి రుతుపవనాలు కేరళ తీరానికి చేరుకుంటాయని అంచనా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

