అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
ఉద్యోగి నియామకానికి సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలు చేయడానికి 250 రోజులు అవసరమా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ): రూ.25 వేలు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లిస్తేనే అప్పీలును విచారణకు స్వీకరిస్తామని తేల్చిచెప్పింది. అప్పీలు దాఖలు చేయడంలో జాప్యానికి బాధ్యులైన అధికారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటికే మరణించిన కే గిరీశ్ ఉపాధ్యాయ సర్వీసు వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ విద్యాశాఖ అప్పీలు దాఖలు చేసింది. దీనిపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలను విన్న ధర్మాసనం రూ.50 వేలు జరిమానా చెల్లిస్తే జాప్యాన్ని మన్నిస్తామని పేర్కొన్నది. దీనికి ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ సెలవులు రావడంతో జాప్యం జరిగిందని, జరిమానాను తగ్గించాలని కోరగా ధర్మాసనం రూ.25 వేలను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగి మరణించినందున సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ అప్పీలుపై విచారణను వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

