సఫారీ రైడ్‌లో నేచర్ గైడ్
అమ్రాబాద్ అడవుల్లో విహారానికి ఏర్పాటుచేసిన సఫారీ రైడ్ (టైగర్ సఫారీ) కోసం నేచర్ గైడ్స్ (ప్రకృతి మార్గదర్శకులు)ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వీళ్లు అడవిలో ఉన్న వనరులపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తారు.
- అమ్రాబాద్ అడవుల్లో ప్రకృతి మార్గదర్శకుల సేవలు
- చెంచు యువతకు అవకాశం కల్పించిన అటవీశాఖ
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ అడవుల్లో విహారానికి ఏర్పాటుచేసిన సఫారీ రైడ్ (టైగర్ సఫారీ) కోసం నేచర్ గైడ్స్ (ప్రకృతి మార్గదర్శకులు)ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వీళ్లు అడవిలో ఉన్న వనరులపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తారు. జంతువుల నుంచి పర్యాటకులకు ఎలాంటి హాని జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటారు. ఏ ప్రాంతంలో ఏ చెట్లు ఉంటాయి? జంతువులు, పక్షులు ఏ ప్రాంతంలో సంచరిస్తాయి? వాటి జీవన శైలి ఎలా ఉంటుంది? జంతువులు ఆహారాన్ని ఎలా సేకరిస్తాయి? వేటాడే పద్ధతులు, వన్య ప్రాణుల నివాస ప్రాంగణాల వంటి వాటి వివరాలు తెలియజేస్తారు. గైడ్స్‌గా అడవిలో అణువణువూ తెలిసిన చెంచు యువతకు ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పించింది. దీంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం సరికొత్త రూపు సంతరించుకొన్నది. చెంచు యువకులకు అటవీ రక్షణలో భాగస్వామ్యం కల్పించటంతో పాటు, ఉపాధి కోసం వారికి శిక్షణ ఇచ్చామని అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ పీఆర్ అధికారి శ్వేత తెలిపారు. ‘బల్మూర్, అమ్రాబాద్, బిల్లకల్, అచ్చంపేట, మన్ననూర్ మండలాలకు చెందిన 10 మంది నేచర్ గైడ్స్‌గా ఎంపికయ్యారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు వీరు గైడ్స్‌గా వ్యవహరిస్తారు. టూరిస్టులు ఎక్కువగా వస్తే ఒక వాహనానికి ఇద్దరు గైడ్స్ ఉంటారు. ఒక్కో గైడ్‌కు రూ.100 పారితోషికం చెల్లిస్తారు’ అని వెల్లడించారు.
పుట్టినప్పటి నుంచి మొక్కలు, జంతువులతోనే సహజీవనం
పుట్టినప్పటి నుంచి అడవిలోనే బతుకుతున్నాం. చెట్లు, వన్యమృగాలతో సహజీవనం చేస్తున్నాం. జంతువులు, పక్షుల శబ్దాలను విని వాటిని గుర్తిస్తాం. జంతువుల అడుగు జాడలను చూసి ఏ వైపు, ఏ జంతువు సంచరిస్తున్నదో ఇట్టే పసిగడతాం. ఆ అడుగులకు అనుగుణంగా జంతువుల నుంచి దాడులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో జంతువులు దాడి చేయడానికి ప్రయతిస్తే, ధైర్యంగా ఎదుర్కొంటాం.
– వీరస్వామి, చెంచుగూడెం, బల్మూరు మండలం
అడవిలో అణవణువు తెలుసు
అడవిలోని ప్రతి అణువణువు మాకు తెలుసు. ఏ చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయి? అవి మనుషులకు ఎలా ఉపయోగపడుతాయో తెలుసు. ఇప్పటి వరకు తేనె తీయటం, అడవి ఉత్పత్తులను సేకరించి అమ్మడం వంటి పనులు చేసేవాళ్లం. బడికి వెళ్తున్నాం. అటవీశాఖ ఆధ్వర్యంలో నెల పాటు శిక్షణ పొందాం. సఫారీకి వచ్చే పర్యాటకులకు గైడ్స్‌గా వ్యహరించే అవకాశం రావడం సంతోషంగా ఉన్నది.
– గణేశ్, చెంచుగూడెం, బల్మూరు మండలం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

