హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2026కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సోమవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ వృద్ధి రేటు 8శాతం ఉంటే.. రాష్ట్ర వృద్ధి రేటు మాత్రం 10.7శాతం ఉన్నదని తెలిపారు.
రాష్ట్రంలో వృద్ధి రేటు పెరగడానికి కావాల్సిన మానవ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాలు ఉన్నందున విదేశీ పెట్టుబడులు హైదరాబాద్కు వస్తున్నాయని తెలిపారు.