హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఓపెన్ స్కూల్(సార్వత్రిక విద్యాపీఠం)ప్రవేశాల షెడ్యూల్ విడుదలయ్యింది. 2026-27 విద్యాసంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కే లింగయ్య సోమవారం విడుదల చేశారు. జూన్ 29 నుంచి జూలై 28 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని, ఆలస్య రుసుముతో జూలై 29 నుంచి ఆగస్టు 29 వరకు అవకాశమిస్తామని లింగయ్య తెలిపారు. వివరాలకు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
అభ్యర్థులు ప్రవేశాల కోసం ఒక్క ఆధార్‌కార్డు జిరాక్స్ సమర్పిస్తే సరిపోతుంది. అభ్యర్థి గతంలో ఏదేని పాఠశాలలో చదివిన రికార్డుషీట్, టీసీ కాపీలను జతచేయాలి. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు పూరించొచ్చు. ఓపెన్స్కూల్లో అడ్మిషన్ పొందేందుకు నిర్దిష్ట వయస్సు.. అక్షర పరిజ్ఞానం ఉండాలి. ఎస్సెస్సీలో చేరేందుకు ఆగస్టు 31నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి. ఇంటర్లో చేరేందుకు 15 ఏండ్లు నిండి ఉండాలి. ఆదివారం పూట క్లాసులు నిర్వహిస్తారు.