హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): టీజీజెన్కో అకౌంట్స్ విభాగంలో పెండింగ్‌లో ఉన్న ఇన్చార్జి ఉద్యోగోన్నతుల మంజూరుపై అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు యూనియన్ జనరల్ సెక్రటరీ పీ అంజయ్య నేతృత్వంలోని బృందం గురువారం ఎనర్జీ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసింది.
సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారానికి చొరవచూపినందుకు కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ జెన్కో చైర్మన్ అండ్ సీఎండీ హరీశ్‌ను కూడా కలిసి ధన్యవాదాలు చెప్పింది. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాజర్ షరీఫ్, అసోసియేషన్ బాధ్యులు అనురాధ, సిద్ధు, డీ శ్రీనివాస్, ఎం శ్రీకాంత్ పాల్గొన్నారు.