హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీలో భాగంగా నాలుగు రిక్రూట్మెంట్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్టు టీజీపీస్సీ కార్యదర్శి హరిత సోమవారం తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్(అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టుల భర్తీకి అక్టోబర్ 24, పీసీబీలోనే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 26 రాత పరీక్ష జరుగుతుందని వెల్లడించింది.
ఆర్అండ్బీలో అసిస్టెంట్ ఎగ్జిగ్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులకు నవంబర్ 6,7 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నది. పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్/ గెజిటెడ్ హెచ్ఎం గ్రేడ్-1కు నవంబర్ 12,13 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు.