Burrakatha | తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత.. టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక
Burrakatha | తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది. చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన ' శాంసన్ అండ్ దెలీలా ' అనే బుర్ర కథ టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్ రావు, చిల్కూరి వసంతరావు, చిల్కూరి సుశీల్ రావు అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించారు
Burrakatha | తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది. చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన ‘ శాంసన్ అండ్ దెలీలా ‘ అనే బుర్ర కథ టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్ రావు, చిల్కూరి వసంతరావు, చిల్కూరి సుశీల్ రావు అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించారు. వీరుడైన శాంసన్ అందమైన దెలీలాతో ఎలా ప్రేమలో పడతాడనే బైబిల్ కథ ఆధారంగా శాంసన్ అండ్ దెలీలా బుర్ర కథను రూపొందించారు. టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్న శాంసన్ అండ్ దెలీలా బుర్రకథను చిల్కూరి సుశీల్‌రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ కథను ప్రధాన కళాకారుడు చిల్కూరి వసంతరావు అద్భుతంగా ప్రదర్శించారు. ప్రేమ, ద్రోహం అలాగే ఎదురించి పోరాడటం వంటి అంశాలను తన కథలో చక్కగా వివరించారు.
చిల్కూరి బుర్రకృథ బృందం 1970 చివర, 1980 తొలినాళ్లలతో తమ ప్రదర్శనలను ప్రారంభించింది. అప్పట్నుంచి హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో అనేక బుర్రకథ ప్రదర్శనలను ఇచ్చింది. ఇక ఈ బృందం సభ్యుల విషయానికొస్తే.. చిల్కూరి శ్యామ్ రావు సీనియర్ న్యాయవాది. చిల్కూరి వసంతరావు బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. చిల్కూరి సుశీల్ రావు పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ కూడా. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోని కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే అందించే ఫిలిం కోర్స్ చేశారు. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ (NPTEL) ద్వారా IIT మద్రాస్, సెంట్రల్ యూనివర్శిటీ – కేరళ అందించే ఫిలిం సర్టిఫికెట్ కోర్సులు చేశారు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగితంలో ఐఐటీ మద్రాసులో సర్టిఫికెట్ కోర్సు కూడా పూర్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

