హైదరాబాద్: తెలంగాణ వర్సిటీలో ఇటీవల జరిగిన నియామకాలు రద్దయ్యాయి. వర్సిటీలో ఇటీవల వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో అవుట్ సోర్సింగ్ నియామకాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిమాయకాలను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశాలు జారీ చేశారు.
వీసీ తీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్లో తెలంగాణ వర్సిటీ ఈసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే వీసీ చేపట్టిన నియామకాలను రద్దు చేస్తూ కమిషనర్ ఆదేశాలిచ్చారు. వీసీ తీరుపై ఈసీ సభ్యులు కూడా అభ్యంతరాలు తెలిపారు. ఈ క్రమంలో ఈసీ సభ్యుల పట్ల వీసీ తీరు సరికాదని కమిషనర్ నవీన్ మిత్తల్ ఆరోపించారు.
ఈసీ సభ్యులకు ఆలస్యంగా అజెండా ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వర్సిటీ ఈసీ సమావేశాన్ని ఈ నెల30వ తేదీకి వాయిదా వేశారు. ఆ భేటీలో తాను కూడా పాల్గొంటానని కమిషన్ నవీన్ మిత్తల్ తెలిపారు.