Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): బ్లడ్బ్యాంకుల ఏర్పాటులో రాష్ట్రం ముందువరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 268 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.
ఇం దులో 61 ప్రభుత్వ, 207 ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ప్రతి 10 లక్షల మంది జనాభాకు సగటున అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంకుల నిష్పత్తిని పరిశీలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. ఆధార్ విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభా 3.82 కోట్లు. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందికి 7 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.