విద్యుదుత్పత్తిలో తెలంగాణ టాప్

- టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు
- కేటీపీపీలో నూతన క్వార్టర్ల ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): విద్యుదుత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో ఉద్యోగుల కోసం నిర్మించిన 430 క్వార్టర్ల సముదాయం, ఏసీహెచ్‌పీ కెమికల్ ల్యాబ్ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీపీపీలోని పలు విభాగాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను సీఎండీ పరిశీలించారు. సర్వీస్ భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్లలో బొగ్గు నిల్వ లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మేరకు అంతరాయం లేకుండా ఉత్పత్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందిస్తున్నదన్నారు. అందుకు అనుగుణంగా టీఎస్ జెన్కో కృషి చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Genco
- KTPP
- new quarters
RELATED ARTICLES
తాజా వార్తలు
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

