కరోనాపై పోరులో రైల్వే తోడ్పాటు

- బాధితుల కోసం 4 వేల బోగీలు, 64 వేల పడకలు సిద్ధం
- ఎల్ఎండీ సిలిండర్ల తరలింపులో ప్రత్యేక ఏర్పాట్లు
- తెలంగాణ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో రైల్వే కీలకపాత్ర పోషిస్తున్నది. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి ప్రాణవాయువును తరలించేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తున్నది. కరోనా బాధితుల కోసం ఇప్పటివరకు దేశంలోని అన్ని రైల్వేజోన్ల పరిధిలో 4 వేలకుపైగా కొవిడ్ కేర్ కోచ్‌లను ఏర్పాటుచేసింది. వాటిలో దాదాపు 64 వేల పడకలను సిద్ధంచేసింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలోనే దాదాపు 450కి పైగా బోగీలను అందుబాటులో ఉంచింది. మొత్తంగా దాదాపు 150 పైగా కొవిడ్ కేర్ కోచ్‌లను మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర ఐదు రాష్ర్టాలు ఉపయోగించుకున్నాయి. తెలంగాణలో సైతం రైల్వే బోగీల ద్వారా కరోనా రోగులకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 100 బోగీలను సిద్ధంచేసి ఉంచాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులను రాష్ట్ర వైద్యాధికారులు కోరినట్టు తెలిసింది. ఇప్పటికే సికింద్రాబాద్, కాజీపేట వంటి కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో కొవిడ్ కేర్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చామని రైల్వే అధికారులు ప్రకటించారు.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ టు ఒడిశా
కరోనా బాధితులకు అవసరమైన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎండీ)ని ఉత్పత్తి ప్లాంటు నుంచి ఇతర ప్రాంతాలకు చేరవేయడంలో రైల్వేలు ముఖ్యభూమికి పోషిస్తున్నాయి. పలు మార్గాల్లో ఇప్పటికే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. మొత్తం ఐదు ఆక్సిజన్ ట్యాంకర్లతో ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోని అంగూల్‌కు బయలుదేరింది. ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్‌ను నింపుకొని సికింద్రాబాద్‌కు తిరిగి వస్తుంది. ఇది తెలంగాణ నుంచి బయలుదేరిన మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వేగంగా నడుపడానికి ఆయా మార్గాల్లో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేసింది. రైళ్ల రాకపోకలకు ఆటంకాలు లేకుండా ఆయా డివిజన్ల మేనేజర్లు నిత్యం పర్యవేక్షించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona
- Oxygen express
- Railway
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

