Women Commission | మహిళలపై సామెతలు ప్రయోగించొద్దు.. బండి సంజయ్‌ను హెచ్చరించిన మహిళా కమిషన్
Women Commission | హైదరాబాద్ : బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) తెలంగాణ మహిళా కమిషన్( Telangana State Commission for Women ) ఎదుట శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ను మహిళా కమిషన్ దాదాపు మూడు గంటల పాటు విచారించింది.

కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ ఆయనను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. గతంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలను సంజయ్‌కు కమిషన్ చూపించింది. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించలేదని బండి సంజయ్ కమిషన్ ఎదుట సంజాయిషీ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. మరోసారి బండి సంజయ్‌ను కమిషన్ విచారించే అవకాశం ఉంది. మహిళలపై మరోసారి సామెతలు ప్రయోగించొద్దని సంజయ్‌ను కమిషన్ ఆదేశించింది. ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎవరైనా సరే మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానిస్తే కఠిన చర్యలు తప్పవని మహిళా కమిషన్ హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!