పెత్తనం లేని ఉత్తమ్!
రాష్ట్ర అధికార పీఠంలో అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరిందా? ముఖ్యనేత క్రమంగా సీనియర్ మంత్రుల శాఖలను తన గుప్పిట్లోకి తీసుకుంటున్నరా? ఇప్పటికే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఏకాకిని చేసేశారా? ఆయన శాఖల్లో పోస్టింగులు, బదిలీల నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు తదితర అన్ని కీలక నిర్ణయాలు ఉన్నత స్థాయిలో జరిగిపోతున్నయా? ఆయనను ఉత్సవ విగ్రహంగా మార్చే వ్యూహం అమలవుతున్నదా? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.
- ఉత్సవ విగ్రహంగా మిగిలిన సీనియర్ మంత్రి
- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాఖలన్నీ ముఖ్యనేత గుప్పిట్లోకి..
- సీఎంవో కనుసన్నల్లో రెండు శాఖల కీలక విభాగాలు
- పౌరసరఫరాల్లో పోలీస్ మార్ యాక్షన్.. మంత్రికి తెలియకుండా దాడులు, అరెస్టులు
- ఇరిగేషన్లో పాగా వేసిన పొరుగు రాష్ట్ర అధికారులు
- బిల్లులు, పోస్టింగుల్లో మంత్రి ఉత్తమ్ సిఫార్సుకు బ్రేక్
- నేరుగా ఉన్నత స్థాయిలోనే ఫైళ్లకు మోక్షం.. వైఫల్యాలన్నీ మంత్రి ఖాతాలో వేసేలా సెచ్
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అధికార పీఠంలో అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరిందా? ముఖ్యనేత క్రమంగా సీనియర్ మంత్రుల శాఖలను తన గుప్పిట్లోకి తీసుకుంటున్నరా? ఇప్పటికే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఏకాకిని చేసేశారా? ఆయన శాఖల్లో పోస్టింగులు, బదిలీల నుంచి కాంట్రాక్టర్ల బిల్లులు తదితర అన్ని కీలక నిర్ణయాలు ఉన్నత స్థాయిలో జరిగిపోతున్నయా? ఆయనను ఉత్సవ విగ్రహంగా మార్చే వ్యూహం అమలవుతున్నదా? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.
పౌరసరఫరాల శాఖ, సాగునీటిపారుదల శాఖల్లో ఉత్తమ్ ఆదేశాలకు బ్రేకులు వేశారని చెప్పుకుంటున్నరు. ముఖ్యనేత కనుసన్నల్లోనే మొత్తం యంత్రాంగం నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సుమారు రూ.3,900 కోట్ల విలువైన సీఎమ్మార్ బకాయిలపై మంత్రి ప్రమేయం లేకుండానే విజిలెన్స్ దాడులు, అరెస్టులు సాగుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. నీటిపారుదల శాఖలో ఫైళ్లను కూడా ముఖ్యనేత కార్యాలయమే శాసిస్తున్నదనే చర్చ జోరందుకున్నది. దీంతో బాధ్యతలున్నా పెత్తనం లేని ఉత్త నేతగా మంత్రి మారారని ప్రచారం జరుగుతున్నది.
పోలీసు అధికారిదే పెత్తనం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సీజన్లకు సంబంధించి ఏకంగా రూ.3,900 కోట్ల నుంచి రూ.6,000 కోట్ల పైచిలుకు విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)బకాయిలు పేరుకుపోయాయి. వీటి రికవరీ కోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి గ్రేహౌండ్స్, అక్టోపస్ బలగాలకు చెందిన ప్రత్యేక కమాండోలను జతచేసినట్టు సమాచారం. సాధారణంగా ఇలాంటి నిర్ణయాల్లో సంబంధిత మంత్రి సూచనలు తీసుకోవడం ఆనవాయితీ. కానీ ఇకడ ఆయనకు తెలియకుండానే సీఎంవో స్థాయి ఆదేశాలతో, ఓ పోలీస్ ఉన్నతాధికారి నేతృత్వంలో దాడులు, అరెస్టుల పర్వం నడుస్తున్నదని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి.
గతంలో కీలక భద్రతా విభాగాల్లో పనిచేసిన సదరు పోలీస్ బాస్‌ను ఇకడ నియమించిన నాటినుంచే పగ్గాలు అప్పగించారని, మంత్రి పాత్రను నామమాత్రం చేసేశారని అంటున్నరు. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ పరిధిలోని మిల్లులపైనే విజిలెన్స్ బృందాలు గట్టిగా దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతున్నది. సూర్యాపేట జిల్లా కోదాడ, కొమరబండ పరిసర ప్రాంతాల్లోని 9 మిల్లుల్లో రూ.239 కోట్ల వరకు, నల్గొండ జిల్లాలోని ప్రధాన మిల్లుల్లో రూ.80 కోట్ల మేర గోల్మాల్ జరిగినట్లు నివేదికలు బయటకు వచ్చాయి.
ఇందులో సదరు సీనియర్ నేతకు అత్యంత సన్నిహితులు, నియోజకవర్గ అనుచరులుగా ముద్రపడిన మిల్లర్ల వ్యాపారాలే ఎకువగా ఉన్నాయని చెప్పుకుంటున్నరు. వారిపై పీడీయాక్ట్, ఆస్తుల జప్తు, క్రిమినల్ కేసులు బనాయించేలా ఉన్నతస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు చెప్పుకొంటున్నారు. మిల్లర్ల అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి గడువులు ఇచ్చే ఆనవాయితీని పూర్తిగా పకనబెట్టి, నేరుగా పోలీసుల ద్వారా జైలుకు పంపించేలా చక్రం తిప్పుతున్నారు. తద్వారా మంత్రిని బదనాం చేసి రాజకీయంగా ఇరుకున పెట్టాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.
విఫల మంత్రిగా నిలబెట్టే వ్యూహం
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ లోపాలు, ఆయకట్టుకు నీరందక ఎదురవుతున్న తీవ్ర జలసంక్షోభం వంటి వైఫల్యాలన్నీ సదరు మంత్రి ఖాతాలోనే పడేలా పకా రాజకీయ వ్యూహం అమలవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నాటి వరద సీజన్లో కృష్ణా, గోదావరి నదుల్లో రికార్డు స్థాయిలో వరదలు పోటెత్తినా, జలాలను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాజెక్టులను నింపడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
గోదావరి బేసిన్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి ప్రధాన రిజర్వాయర్లను నింపే అవకాశమున్నా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఇరిగేషన్ నిపుణులు మండిపడుతున్నరు. దీంతో గోదావరి నది నుంచే సుమారు 2,350 టీఎంసీలకు పైగా అమూల్యమైన జలాలు వృథాగా సముద్రం పాలయ్యాయని అంటున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్లోనూ సరైన నీటి యాజమాన్య ప్రణాళిక లేకపోవడంతో సుమారు 700 నుంచి 750 టీఎంసీలకు పైగా జలాలు ఏపీలోని ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి, అటు ఆంధ్రా ప్రాజెక్టులకు తరలిపోయాయని చెప్తున్నారు.
వరదల సమయంలో కేవలం 200 నుంచి 300 టీఎంసీల నీటిని సమర్థవంతంగా లిఫ్ట్ చేసి చెరువులు, రిజర్వాయర్లలో నిల్వ చేసి ఉంటే యావత్ తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు తీరి కరువు ఛాయలే ఉండేవి కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ, ఎగువ నుంచి వచ్చిన వరదను వదిలేసి, ఆయకట్టు భూములను ఎండబెట్టడం వెనుక ముఖ్యనేత విధానపరమైన నిర్ణయాల వైఫల్యమే అనే ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రజల్లో, రైతుల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను మాత్రం నీటిపారుదల శాఖ మంత్రి మీదికే మళ్లిస్తున్నారని అధికార పార్టీ వర్గా లు వెల్లడించాయి. ‘నీటిపారుదల శాఖను నడిపించలేక కరువు తెచ్చారు’ అనే మంత్రి ని బలిపశువును చేసేందుకు తెరవెనుక ప్రచా రం నడిపిస్తున్నారని చెప్పుకొంటున్నరు.
బిల్లులు, బదిలీల్లో వాళ్లదే హవా..
నీటిపారుదల శాఖలో పాలనాపరమైన ఫైళ్లన్నీ పొరుగు రాష్ర్టానికి చెందిన సీనియర్ ఇంజినీర్ల కనుసన్నల్లోనే సాగుతున్నాయని, నేరుగా ఉన్నతస్థాయిలోనే క్లియర్ అవుతున్నాయని ఇరిగేషన్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ శాఖలోని సహాయ కార్యదర్శి స్థాయి మొదలుకుని ఈఎన్సీ, ఈఎన్సీ జనరల్‌తోపాటు కీలక చీఫ్ ఇంజినీర్ల స్థానాల్లో పొరుగు రాష్ర్టానికి చెందిన అధికారులే ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం వ్యవహారాలను వారే నడిపిస్తున్నారని జలసౌధలో చెప్పుకుంటున్నారు.
ఈ బృందం పంపిన దస్త్రాలు నేరుగా ముఖ్యనేత కార్యాలయానికి వెళ్తున్నాయని, గంటల వ్యవధిలోనే ఆమోదం పొందుతున్నాయని సచివాలయ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల మంజూరు, బదిలీలు, కీలక పోస్టింగుల ప్రక్రియలోనూ మంత్రి సిఫార్సులకు విలువలేకుండా పోయిందన్న చర్చ జోరుగా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ కేటాయింపులు ఉండే సాగునీటి ప్రాజెక్టుల నిధుల విడుదల ప్రక్రియ మొత్తం ముఖ్యనేతతో ముడిపడి ఉండటంతో, కాంట్రాక్టర్లు సైతం మంత్రి పేషీని కాదని నేరుగా ఉన్నతాధికారులను, ముఖ్యనేత కార్యాలయ వర్గాలనే ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో సదరు సీనియర్ మంత్రి నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారని చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

