Group-4 Notification | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల
Group-4 Notification | తెలంగాణ గ్రూప్-4 నోటిపికేషన్ విడుదలైంది. 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి
హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలను tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఇటీవల 9,168 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్-4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. గతంలో గ్రూప్-2లో 663 పోస్టులు గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మరికొన్ని కేటగిరీలకు సంబంధించిన పోస్టులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

