ప్రజల ఆశీర్వాదం మాకే
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తమకే ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇప్పటికే తెలంగాణను సాధించి రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా మరో చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మంచి వాళ్లు ఉండాలని, మంచి చేసినోళ్లే ఉండాలని గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భావించారని పేర్కొన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లో ఉన్న పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కొత్త చరిత్ర సృష్టిస్తారు
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తమకే ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇప్పటికే తెలంగాణను సాధించి రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా మరో చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మంచి వాళ్లు ఉండాలని, మంచి చేసినోళ్లే ఉండాలని గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భావించారని పేర్కొన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లో ఉన్న పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పింక్ వేవ్ వచ్చిందని చెప్పారు. పింక్ వేవ్ స్పందన చూస్తే తమను ప్రజలు పెద్దఎత్తున ఆశీర్వదించి చరిత్ర సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హెడ్ఆఫీస్ నుంచి చాలా ప్రోత్సాహం లభించిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
నిండు గర్భిణి.. చాటింది ఓటు ఖ్యాతిని
ఓ నిండు గర్భిణి.. పురిటినొప్పులు భరిస్తూనే ఓటేసి ప్రజాస్వామ్య దేశంలో ఓటుకున్న ఖ్యాతిని చాటిచెప్పింది. తన ఓటు వృథా కాకూడదన్న సంకల్పంతో ఓటు హక్కు వినియోగించుకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని మేడికొండకు చెందిన మాధవి గురువారం మధ్యాహ్నం ఓటు వేసి కాన్పు కోసం అయిజకు వెళ్లాలని నిర్ణయించుకున్నది. అదే సమయంలో పురిటి నొప్పులు మొదలుకాగా.. కుటుంబసభ్యులు హుటాహుటిన పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించారు. అనంతరం 108లో అయిజ పీహెచ్‌సీకి తరలించగా.. డాక్టర్లు సాధారణ కాన్పు చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.
-అయిజ
ఓటేసిన శతాధిక వృద్ధురాలు
104 ఏండ్ల వృద్ధ్దురాలు ఓటు హక్కును వినియోగించుకొని.. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఎంత కీలకమో చాటిచెప్పింది. సిద్దిపేట పట్టణంలోని బారాయిమామ్కు చెందిన జోహరబీ (శతాధిక వృద్ధురాలు).. ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి నాసర్‌పురా పోలింగ్ బూత్‌లో ఓటేసింది. ఓటును నిర్లక్ష్యం చేసేవారికి ఆదర్శంగా నిలిచింది.
-సిద్దిపేట టౌన్
తొలిసారి ఓటేసిన జంట కవలలు
హనుమకొండ జిల్లా శాయంపేట మండంలోని గట్లకానిపర్తికి చెందిన రౌతు రమేశ్, సువర్ణ దంపతులకు నలుగురు కవల పిల్లలు.. రౌతు రాజ్‌దీప్, రౌతు రాహుల్, రౌతు రోహన్, రౌతు రోహిత్ ఉన్నారు. వారికి ఈ సారి కొత్తగా ఓటు రావడంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పాలుపంచుకున్నారు. గట్లకానిపర్తిలోని పోలింగ్ బూత్‌లో నలుగురు కలిసి ఒకేసారి తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-శాయంపేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?




