Harish Rao | రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల పోలీసులు నైపుణ్యాలు కోల్పోతున్నారు: హరీశ్‌రావు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైమ్ రేటు పెరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 22.5 శాతం పెరిగిందని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు 28.94 శాతం పెరిగాయన్నారు.
Harish Rao | రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైమ్ రేటు పెరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 22.5 శాతం పెరిగిందని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు 28.94 శాతం పెరిగాయన్నారు. ఏడాదిలోనే 2,945 కేసులు అంటే.. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని అన్నారు. 82 మంది మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటు అని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని అన్నారు.
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగు నెలల క్రితం విశ్రాంత బ్యాంకు మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య జంట హత్య, బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య కేసులో కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని హరీశ్‌రావు తెలిపారు. రూ.10కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31 శాతం ఉందని అన్నారు. ఇది బిహార్ (39 శాతం) వంటి రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణమని చెప్పారు. ప్రజా భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు, రాజకీయ దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని, సోషల్‌మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వేధింపులకు గురిచేస్తారని, ఆఖరికి పేరు మరిచిపోతే కూడా కేసులు పెట్టి వేధిస్తారని విమర్శించారు.
ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోకుండా ప్రజల భద్రత కోసం లా అండ్ ఆర్డర్ సంరక్షణ కోసం పోలీసు శాఖను వాడితే బాగుంటుందని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గించడానికి మెరుగైన లా అండ్ అర్డర్ నిర్వహించేందుకు ప్రభుత్వం సకాలంలో పోలీసు శాఖకు బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖను బలోపేతం చేయాలని సూచించారు. చిల్లర రాజకీయాల కంటే ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచాలని, వేగవంతమైన న్యాయాన్ని అందించాలని సూచించారు. అంతేకానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఉపయోగించుకోకూడదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- crime rate
- harish rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

