KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం.. ఎప్పటిలానే ఈసారీ గుండుసున్నానే!: కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ (KTR) అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ (KTR) అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది. కానీ మోదీ సర్కార్ గత పదేండ్లుగా తెలంగాణపై సవితి తల్లి ప్రేమనే చూపుతున్నదని గుర్తు చేశారు.
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి కేంద్రం నుంచి సాయం అందాల్సినప్పటికీ ప్రధాని మోదీ ఎప్పుడూ అది పట్టించుకోలేదన్నారు. ప్రతి బడ్జెట్లో రాష్ట్రానికి మేలు చేసే కేటాయింపులు జరపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సారి బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు ఎలా ఉంటాయని నన్ను ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. దానికి తన సమాధానం ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్ లో అదే పరిస్థితి ఉంటుందని మళ్లీ కేటాయింపులు గుండాసున్నానే అని గట్టి నమ్మకం ఉందన్నారు.
అయితే ఈ సారి బీజేపీకి తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడి ప్రజలు మోదీపై, బీజేపీపై అభివృద్ధి చేస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కేంద్రంలో గెలిచే ప్రభుత్వానికి ఓట్లు వేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించారు. అందుకే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. మరి ఈ ప్రాంత ప్రజల కోసం మన బీజేపీ ఎంపీలు మోదీతో మాట్లాడి ఏం మేలు చేసేలా చేస్తారో వేచి చూడాలి. తనకు తెలిసి మోదీతో మన ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడే సత్తా మన బీజేపీ ఎంపీలకు లేదు. కనుక ఎప్పటిలాగే తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ గుండుసున్నానే అని కేటీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

