పథకాల అమలులో ‘తెలంగాణ’ దేశానికే ఆదర్శం : మంత్రి గంగుల కమలాకర్
Munugode by-election|ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్
సంస్థాన్ నారాయణపురం : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్తాన్ నారాయణపురంలో ఉప ఎన్నికల ప్రచారం, మండల కేంద్రంలోని పార్టీ శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు, పోలింగ్ బూతుల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా జన సమీకరణ ఏర్పాట్లపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా వాటి పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలని శ్రేణులకు సూచించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖరారు అయిందని, మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, గాదరి కిషోర్, సంస్థాన్ నారాయణపూర్ జడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశ్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ చిక్లమెట్ల శ్రీహరి, ఫాక్స్ చైర్మన్ జంగారెడ్డి, టీఆర్ఎస్ నేతలు తెలంగాణ బిక్షం, చిలువేరు బిక్షం, రాము, శంకర్, పల్లె గోవర్ధన్ రెడ్డి, కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

